శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 ఆగస్టు 2021 (19:00 IST)

కోవాగ్జిన్ టీకా సూపర్‌గా పనిచేస్తోంది.. ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి

కోవిడ్-19 డెల్టా ప్లస్ వేరియంట్‌పై భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకా సమర్థవంతంగా పని చేస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన తాజాగా అధ్యయనంలో తేలింది. 
 
గతంలోనే కోవాగ్జిన్ సామర్ధ్యంపై భారత్ బయోటెక్ కీలక విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే. కరోనాకు వ్యతిరేకంగా 77.8 శాతం, డెల్టా ప్లస్ వేరియంట్‌పై 65.2 శాతం మేరకు కోవాగ్జిన్ మెరుగైన ఫలితాలు చూపిస్తుందని భారత్ బయోటెక్ తెలిపింది.
 
అలాగే తీవ్రమైన లక్షణాలు ఉన్న కరోనా రోగులపై కోవాగ్జిన్ 93.4 శాతం ప్రభావితం చూపిస్తుండగా.. స్వల్ప లక్షణాలు ఉన్నవారిపై 63.6 శాతం మేరకు ప్రభావితం చూపుతున్నట్లు అధ్యయనంలో స్పష్టమైంది. 
 
కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగ జాబితాలో(EUL) చేర్చడం కోసం అవసరమైన అన్ని డాక్యుమెంట్స్‌ను భారత్ బయోటెక్ సంస్థ డబ్ల్యూహెచ్‌ఓకు సమర్పించింది. వాటిని జూలై 9న ఏజెన్సీ సమీక్షిస్తుందని కేంద్ర సహాయమంత్రి భారతీ ప్రవీణ్ పవార్ రాజ్యసభకు తెలియజేసిన సంగతి విదితమే.