శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2020 (18:46 IST)

శబరిమల ఆలయంలో కరోనా కలకలం.. 39 పాజిటివ్ కేసులు

శబరిమల ఆలయంలో కరోనా కలకలం రేపుతోంది. నవంబర్ 16న వార్షిక తీర్థయాత్రల కోసం శబరిమల అయ్యప్ప ఆలయం తెరిచినప్పటి నుండి ఇప్పటి వరకు యాత్రికులు, పోలీసు సిబ్బంది ఆలయ ఉద్యోగులు సహా మొత్తం 39 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. మొత్తం పాజిటివ్ కేసులలో 27 మంది వివిధ విభాగాల ఉద్యోగులు ఉన్నారని వారందరినీ వెంటనే కోవిడ్ చికిత్స కేంద్రాలకు తరలించారని చెప్తున్నారు.
 
కోవిడ్ మార్గదర్శకాలకు కట్టుబడి ఈ పుణ్యక్షేత్ర ప్రాంగణం, బేస్ క్యాంప్‌లలో అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని చెప్తున్నారు. ఈ సమయంలో పాజిటివ్ అని తేలిన వారిలో ఇద్దరు తాత్కాలిక సిబ్బందితో సహా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ)కు చెందిన నలుగురు ఉద్యోగులున్నారని టీడీబీ అధికారి తెలిపారు.
 
ఇక్కడి పోలీసు మెస్‌కి చెందిన ఇద్దరు ఉద్యోగులు గురువారం పాజిటివ్‌‌గా తేలారు. ఈ మొత్తం 39 పాజిటివ్ కేసులు సన్నిధానం బేస్ క్యాంప్ అయిన పంబా, నీలక్కల్ సహా వివిధ ప్రదేశాలలో నమోదయ్యాయి.