Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్డౌన్ డిసెంబరు 31 వరకు పొడగింపు... ముఖ కవచం తప్పనిసరి!

Written By ఠాగూర్
Updated: సోమవారం, 30 నవంబరు 2020 (13:18 IST)
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ ఆంక్షలను డిసెంబరు నెలాఖరు వరకు పొడగించింది. దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ కేసులు న‌మోదు అవుతున్న నేప‌థ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
 
అయితే పలు ఆంక్షలను సడలించింది. బీచ్‌ల‌ను ప‌బ్లిక్‌కు ఓపెన్ చేశారు. యూజీ, పీజీ కాలేజీల‌ను తెరిచేందుకు అనుమ‌తి ఇచ్చారు. రాజ‌కీయ స‌మావేశాలు నిర్వ‌హించేందుకు కూడా కొన్ని స‌డ‌లింపులు ఇచ్చారు. వీటన్నింటికీ ఖచ్చితంగా కోవిడ్ నియమావళిని విధిగా పాటించాల్సివుంది. 
 
ఇకపోతే, ప్ర‌జ‌లు ముఖానికి మాస్క్‌లు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. క్రీడా శిక్ష‌ణ కోసం స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమ‌తి ఇచ్చారు. డిసెంబ‌ర్ 14 నుంచి మెరీనా బీచ్‌ను సందర్శించేందుకు పర్యాటకులకు అనుమతి ఇచ్చింది. 
 
కాగా, ప్రస్తుతం చెన్నై మహానగరంతో పాటు.. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన విషయం తెల్సిందే. అయినప్పటికే, దేశంలో ఈ కేసులు నమోదవుతుండటంతో లాక్డౌన్‌ను 31 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.

అన్నీ చూడండి

బాలికలకు హెచ్ పీవీ వ్యాక్సిన్ పై అవగాహన కల్పించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్

Vijay Deverakonda: నేను Unhype అనే మంచి స్కిన్ కేర్ వాడుతున్నా: విజయ్ దేవరకొండ

ఎపిక్..ఐదేళ్ల తర్వాత రావాల్సిన సినిమా అంటున్నారు : ఆనంద్ దేవరకొండ

మంగళసూత్ర మహిళలే ఎందుకు ధరించాలి... పురుషులకు లేని నిబంధనలు స్త్రీలకే ఎందుకు? నటి నమిత ప్రశ్న

Keerthy Suresh: డోరతీ ప్రీమియర్ లో కీర్తి సురేష్‌కు ఘనస్వాగతం పలికిన టొరంటో

తర్వాతి కథనం
Show comments