గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 జనవరి 2022 (11:07 IST)

శ్రీహరికోట షార్ కేంద్రంలో కరోనా కలకలం : 12 మంది ఉద్యోగులకు పాజిటివ్

శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు చెందిన ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. ఏకంగా 12 మంది ఉద్యోగులతో పాటు ఇద్దరు వైద్యులకు ఈ వైరస్ సోకినట్టు తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో వెల్లడైంది. వీరందరి శాంపిల్స్‌ను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం బెంగుళూరులోని పరిశోధనాశాలకు పంపించారు. 
 
ఒకేసారి ఏకంగా 14 మందికి కరోనా సోకడంతో అంతరిక్ష కేంద్రంలో పని చేస్తున్న మిగిలిన ఉద్యోగులకు కూడా కోవిడ్ పరీక్షలను వైద్య శాఖ నిర్వహిస్తుంది. అలాగే, స్పేస్ సెంటరులో కరోనా వైరస్ కలకలం చెలరేగడంతో ప్రత్యేక మార్గదర్శకాలను కూడా షార్ అధికారులు జారీచేశారు. 
 
బయోమెట్రిక్ అటెండెన్స్ స్థానంలో హాజరుపట్టీలను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు, వైద్యులకు ఈ వైరస్ సోకడంతో ఈ నెలాఖరులో నిర్వహించతలపెట్టిన రీశాట్ శాటిలైట్ ప్రయోగాన్ని వాయిదా వేసే అవకాశాలు లేకపోలేదు.