గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 8 ఏప్రియల్ 2021 (14:42 IST)

మహారాష్ట్రలో కోవిడ్ ఆసుపత్రులు ఫుల్, హైదరాబాద్ వచ్చేస్తున్న కోవిడ్ పేషెంట్లు

మహారాష్ట్రలో కోవిడ్ 19 కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అక్కడ రోగుల రద్దీతో ఆసుపత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడుతోంది. దీనితో మెరుగైన చికిత్స కోసం మహారాష్ట్ర - తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు జిల్లాల ప్రజలు నేరుగా హైదరాబాద్ నగరానికి వచ్చేస్తున్నారు. వైరస్ సోకిన రోగులకు వేరే మార్గం లేకుండా పోయింది హైదరాబాద్ వైపు రావడం తప్ప.
 
వారి పట్టణాల్లోని ఆసుపత్రులతో ఇప్పటికే కొరోనావైరస్ రోగులతో నిండిపోయింది. హైదరాబాదు నగరంలోని పలు కార్పొరేట్ ఆసుపత్రులలో మహారాష్ట్రకు చెందిన రోగులు తమ పడకలలో 20 నుండి 30 శాతం వరకు ఉన్నారు.
 
 ఈ రోగులు తప్పనిసరిగా మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన నాందేడ్ మరియు యావత్మల్ నుండి వస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉండటమే కాకుండా, సూపర్-స్పెషాలిటీ చికిత్సను అందించే హైదరాబాద్‌లోని ఆసుపత్రులను రోగులు ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఒక ప్రధాన కారణంగా మారుతోంది.