దేశంలో భారీగా తగ్గిపోయిన కరోనా పాజిటివ్ కేసులు

Written By ఠాగూర్
Updated: గురువారం, 3 మార్చి 2022 (10:55 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గిపోయాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన వివరాల మేరకు గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,561 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 142 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
గత 24 గంటల్లో కరోనా నుంచి 14,947 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 77,151 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. 
 
అదేవిధంగా ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,23,53,620గా ఉంది. కరోనా వైరస్ పాజిటివ్ రేటు 0.74 శాతంగా ఉంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా, ఇప్పటివరకు 178.02 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను పంపిణీ చేశారు. 

అన్నీ చూడండి

అబ్జెక్ష‌న్ మై లార్డ్‌కు అండగా మెగాస్టార్ చిరంజీవి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్‌

Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది

Allari Naresh :సురభి తో నా కంటి మీద కునుకే లేదంటున్న అల్లరి నరేష్

తర్వాతి కథనం
Show comments