ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 డిశెంబరు 2020 (19:40 IST)

అమెరికాలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 2500 మంది మృతి

అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతిరోజు రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అమెరికాలో కొవిడ్ మహమ్మారికి దాదాపు 2500 మందికిపైగా ప్రజలు బలైనట్టు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. ఏప్రిల్ తర్వాత ఇంత భారీ స్థాయిలో కరోనా మరణాలు సంభవించడం ఇదే తొలిసారని పేర్కొంది. 
 
కాగా.. మంగళవారం రోజు అమెరికాలో కొవిడ్ బారినపడిన వారి సంఖ్య 1.80లక్షలు దాటింది. అమెరికాలో సగటున నిమిషానికి ఒక కరోనా మరోణం నమోదవుతుందని గ్లోబల్ హెల్త్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ బెత్ బెల్ తెలిపారు. ఇప్పటి వరకు అమెరికాలో 1.41కోట్ల మంది కరోనా బారినపడగా.. మరణాల సంఖ్య 2.80లక్షలకు చేరువైంది.
 
ఇదిలా ఉంటే.. కరోనా టీకాపైనే అమెరికా ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే ఫైజర్, మోడెర్నా సంస్థలు తాము అభివృద్ధి చేసిన టీకా 90శాతానిపైగా సమర్థవంతంగా పని చేస్తున్నట్లు ప్రకటించాయి. టీకా అత్యవసర వినియోగం కోసం అనుమతి కోరుతూ ఎఫ్‌డీఏ, ఈయూకు దరఖాస్తు కూడా చేసుకున్నాయి. డిసెంబర్ చివరి నాటికి అమెరికన్లు ఈ వ్యాక్సిన్లు అందుబాటులోకి రావొచ్చని వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.