సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 30 మార్చి 2021 (16:02 IST)

మా నాన్నకు కరోనా: ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్

నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, లోక్‌సభ ఎంపి ఫరూక్ అబ్దుల్లా కోవిడ్ -19 పాజిటివ్ నిర్థారణ అయినట్లు ఆయన కుమారుడు ఒమర్ మంగళవారం ప్రకటించారు. "నా తండ్రి కోవిడ్ -19కు పాజిటివ్ పరీక్షించారు. లక్షణాలు బయపడ్డాయి. కనుక నేను కూడా పరీక్షించుకోవడంతో పాటు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి హోం క్వారెంటైన్లో వుంటాను ”అని ఒమర్ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ ఫరూక్ అబ్దుల్లా"త్వరగా కోలుకోవాలి", "సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలి" అని ఆకాంక్షించారు.
 
కాగా గత 24 గంటల్లో భారతదేశం 56,211 కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు చేసింది. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1.20 కోట్లను దాటేసింది. మొత్తం కేసులలో, 5.40 లక్షలు యాక్టివ్ కేసులు కాగా, 1.13 కోట్లకు పైగా ప్రజలు పాజిటివ్ పరీక్షించిన తర్వాత కోలుకున్నారు. 271 కొత్త మరణాలతో, ఇప్పుడు మరణాల సంఖ్య 1.62 లక్షలకు పైగా ఉంది. 
 
మహారాష్ట్రలో సోమవారం 31,643 కేసులు నమోదయ్యాయి. దేశంలో 3.36 లక్షలకు పైగా క్రియాశీల కేసులు నమోదయ్యాయి. దేశంలో కోవిడ్ కేంద్రంగా వున్న మహారాష్ట్ర, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఏప్రిల్ 1 నాటికి కొత్త ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను విడుదల చేస్తుంది. పూర్తి లాక్డౌన్ అయితే, ప్రస్తుతానికి అవకాశం లేదు. భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించడానికి ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేతో రెండవ సమీక్ష సమావేశం ఈ రోజు జరుగుతుంది.