సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 18 మార్చి 2021 (15:29 IST)

ఆ ఒక్కడి అజాగ్రత్త వల్ల నాకు కరోనా తగులుకుంది, ఏమాత్రం జాగ్రత్తలేదు: నటుడు ఫైర్

ఒక్కరి వల్ల తనకు కరోనావైరస్ సోకిందని బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. షూటింగ్ స్పాట్లకు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా కొందరు వస్తుంటారనీ, అలాంటి వారివల్లే ప్రస్తుతం తను ఇలా వుండాల్సి వచ్చిందంటూ చెప్పాడు.
 
కరోనా జాగ్రత్తలు పాటిస్తే చక్కగా షూటింగులు పూర్తి చేసుకునే అవకాశం వుండేదనీ, అజాగ్రత్త వల్ల అటు నటులకు ఇటు ఇండస్ట్రీలోని సభ్యులకు తీవ్ర నష్టం వస్తోందన్నారు. ప్రస్తుతం తను క్వారెంటైన్లో వున్నట్లు చెప్పారు.
 
కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి వచ్చిందనీ, దాన్ని తప్పించుకుంటూ బ్రతకాల్సిందేనన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వుంటే ఎవ్వరూ కరోనా బారిన పడరని చెప్పాడు మనోజ్. డిస్పాచ్ అనే చిత్రం షూటింగ్ చేస్తుండగా తనకు కరోనా తగులుకుందని చెప్పాడు.