శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 మార్చి 2021 (11:28 IST)

తెలంగాణాలో 158 - దేశంలో 18711 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో కొత్తగా 158 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,99,742కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1641కి చేరింది. 
 
కరోనా బారి నుంచి ఆదివారం 207 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,96,166కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,886 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 748 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 30 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.
 
ఇదిలావుంటే, భార‌త్‌లో గత 24 గంటల్లో 18,711 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసింది. వాటి ప్రకారం, 14,392 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  1,12,10,799కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 100 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,756 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,08,68,520 మంది కోలుకున్నారు. 1,84,523 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 2,09,22,344 మందికి వ్యాక్సిన్ వేశారు.
  
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 22,14,30,507 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,37,830 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.