Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (10:59 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు స్పల్పంగా పెరిగాయి. గురువారం వెల్లడించిన కేసులతో పోల్చుకుంటే శుక్రవారం వెల్లడైన కేసుల సంఖ్య అధికంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 4.5 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 1,109 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గురువారం నాటి కేసులతో పోల్చుకుంటే 76 కేసులు అధికం. అదేసమయంలో కరోనా వైరస్ బాధితుల్లో 43 మంది చనిపోయారు. ఇందులో ఒక్క కేరళ రాష్ట్రంలోనే 36 మంది మరణించడం గమనార్హం. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 11,492 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. క్రియాశీల రేటు 0.03 శాతంగా ఉంది. అదేసమయంలో ఇప్పటివరకు కరోనా నుంచి 4,25,00,002 మంది కోలుకున్నారు. మరో 5,21,573 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 185 కోట్ల కరోనా డోసులను వేశారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments