శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (12:44 IST)

దేశంలో మరింతగా తగ్గిన కరోనా కేసులు - కలవరపెడుతున్న ఎక్స్ఈ

pneumonia after corona
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బాగా తగ్గిపోయాయి. అదేసమయంలో ఎక్స్ఈ కరోనా వేరియంట్ ఇపుడు కలవరపాటుకు గురిచేస్తుంది. ముంబైలో తొలి ఎక్స్ఈ వేరియంట్ కేసు నమోదైంది. 
 
ఇదిలావుంటే, గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1033 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోల్చుకుంటే మరింతగా తగ్గాయి. మరోవైపు, కరోనా బాధితుల్లో 1,222 మంది కోలుకోగా, 43 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 11,639 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, దేశంలో కరోనా వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 4.3 కోట్ల మందికి ఈ వైరస్ సోకింది. వీరిలో 4,24,98,789 మంది కోలుకున్నారు. మొత్తం 5,21,530 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. మరోవైపు, కరోనా కొత్త వేరియంట్ ఎక్స్ఈ కలవరపెడుతుంది. ఈ తొలి కేసు ముుంబైలో నమోదైనట్టు వార్తలు వస్తుంటే, కేంద్ర మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతోంది.