గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (14:35 IST)

జేఈఈ ప్రవేశ పరీక్షలు మరోమారు వాయిదా

jee exam
ఉమ్మడి ప్రవేశ పరీక్షలు (జేఈఈ) మరోమారు వాయిదాపడ్డాయి. నిజానికి ఈ పరీక్షను ఈ నెలలో నిర్వహించాల్సివుంది. కానీ, జూన్ నెలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం నిర్వహిస్తుంటారు. గత రెండేళ్ళ నుంచి కరోనా వైరస్ కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. ఇపుడు మరోమారు వాయిదావేశారు.
 
అయితే, ఈ యేడాది కూడా ఈ వాయిదా పర్వం కొనసాగుతుంది. ఇపుడు జేఈఈ మొదటి విడత పరీక్షను జూన్ 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తారు. మేలో జరగాల్సిన రెండో విడత జేఈఈ మెయిన్స్ పరీక్షను జూలై 21 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. సీబీఎస్ఈతో పాటు పలు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ఉండటంతో జేఈఈ ప్రవేశ పరీక్షలను వాయిదావేశారు.