ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 జులై 2022 (10:23 IST)

దేశంలో కొత్తగా మరో 20 వేల కరోనా పాజిటివ్ కేసులు

covid
దేశంలో కొత్తగా మరో 20 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రత్యేక బులిటెన్ మేరకు గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 20,409 కోవిడ్ కేసులు నమోదు కాగా, మరో 47 మంది చనిపోయారు. 
 
ఈ కొత్త కేసులతో కలుపుకుని మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,39,79,730కి చేరుకున్నాయి. అలాగే 5,26,258 మంది మరణించారు. ఇప్పటివరకు 4,33,09,484 మంది ఈ వైరస్ బారినుంచి కోలుకున్నారు. మరో 1,43,988 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 22697 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.