Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఏమాత్రం తగ్గని కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

Written By ఠాగూర్
Updated: సోమవారం, 9 ఆగస్టు 2021 (10:55 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ మేరకు గడిచిన 24 గంటల్లో 35,499 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. వీటితో కలుపుకుని దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,19,69,954కు చేరింది.
 
ఇక మరణాల విషయానికొస్తే... నిన్న 447 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,28,309కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,11,39,457 మంది కోలుకున్నారు. 
 
4,02,188 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 50,86,64,759 వ్యాక్సిన్ డోసులు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు. రిక‌వ‌రీ రేటు 97.40 శాతంగా ఉంది.
 
ఇకపోతే, ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97.40 శాతానికి చేరుకుందని, మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.26శాతం ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.35శాతంగా ఉందని, రోజువారి పాజిటివిటీ రేటు 2.59శాతంగా ఉందని వివరించింది.

అన్నీ చూడండి

Sangeeth Shobhan : కొత్త సినిమా పోస్టర్ తో పుట్టినరోజు జరుపుకున్న సంగీత్ శోభన్

Raaka Update: అల్లు అర్జున్, అట్లీల చిత్రంలో విల్ స్మిత్, షారుఖ్ ఖాన్‌ ఎంట్రీ ఇవ్వనున్నారా !

ముగిసిపోయిన బంధానికి అనుపమ మళ్లీ ప్రాణం పోయడం ఎందుకు?

NTR emotional : పెంపుడు కుక్క భఘీరను కోల్పోయిన ఎన్టీఆర్. భావోద్వేగ పోస్ట్

Brahmanandam: తోడబుట్టిన అన్నయ్య ను పలుకరించే భాగ్యం బ్రహ్మానందం కు లేదా ?

తర్వాతి కథనం
Show comments