Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా వైరస్ కేసుల తాజా సమాచారం..

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 13 డిశెంబరు 2020 (10:35 IST)
దేశంలో గత  24 గంటల్లో మరో 30254 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. ఈ ప్రకటన మేరకు గత 24 గంటల్లో 30,254 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 98,57,029కు చేరింది.
 
ఇక గత 24 గంటల్లో 33,136 మంది కోలుకున్నారు. గత 24 గంట‌ల సమయంలో 391 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,43,019కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 93,57,464 మంది కోలుకున్నారు. 3,56,546 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 15,37,11,833 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. శనివారం 10,14,434 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 
 
మరోవైపు, తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 573 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 609 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,77,724కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,68,601 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,493కి చేరింది. 
 
తెలంగాణలో ప్రస్తుతం 7,630 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 5,546 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 127, రంగారెడ్డి జిల్లాలో 58 కరోనా కేసులు నమోదయ్యాయి.
 

అన్నీ చూడండి

రజనీకాంత్, కమల్ హాసన్ ధర్మన్ రెండవ షెడ్యూల్ ప్రారంభం

హుషార్ పిట్టలు కంటెంట్ అందరికీ కనెక్ట్ అవుతుంది :వెంకట్‌ యాదవ్‌

Nag: కన్స్యూ మర్ యాప్ ను ప్రారంభించిన బ్రాండ్ అంబాసిడర్ అక్కి నేని నాగార్జున

Kamakshi Bhaskarla: వద్దు అని నా ముందే అన్నారు,అదే చేదు అనుభవం : కామాక్షి భాస్కర్ల

రెండేళ్ల పాటు అలాంటి సంబంధంలో గడిపాను.. అపరిచితుడులా మారేవాడు.. అనుపమ

తర్వాతి కథనం
Show comments