Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సిన్లకు భిన్నం.. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సింగిల్ డోస్ టీకా

Written By సెల్వి
Updated: శనివారం, 3 ఏప్రియల్ 2021 (10:07 IST)
కరోనా వ్యాక్సిన్లకు భిన్నంగా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ సింగిల్‌ డోస్‌ టీకా తీసుకువచ్చిన విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్‌లో మధ్య వయసున్న వారిపై ఆ టీకా ట్రయల్స్ నిర్వహించింది.

తాజాగా 16, 17 ఏళ్ల వయసున్న వారిపై టీకా ట్రయల్స్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఆ తర్వాత 12 నుంచి 15 ఏండ్ల మధ్య వయసున్న వారిపై కూడా ప్రయోగాలు చేస్తామని పేర్కొంది. 
 
తొలి దశలో యూకే, స్పెయిన్ దేశాలకు చెందిన వారిపై టీకా ప్రయోగాలు నిర్వహించనుంది. ఆ తర్వాత యూఎస్, కెనడా, నెదర్లాండ్స్‌కు చెందిన వారిని ఈ జాబితాలో చేర్చనుంది. గర్భిణి స్ర్తీలు, చిన్నారులపై కూడా ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తెలిపింది.

అన్నీ చూడండి

మాతృత్వంలోకి అడుగుపెడుతున్న తరుణంలో శ్రీకల్పం వేడుకను పాటించిన సమంత

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments