శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 నవంబరు 2021 (10:10 IST)

దేశంలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఒకవైపు ఒమిక్రాన్ వైరస్ భయపెడుతోంది. మరోవైపు, కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 6990 కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుద చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
అలాగే, 24 గంటల్లో 190 మంది మృత్యువాతపడగా, మరో 10116 మంది ఈ వైరస్‌ను జయించారు. ప్రస్తుతం ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో కలుపుకుని మొత్తం 1,00,543 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 4,68,980 మంది ఈ వైరస్ బారినపడి చనిపోయారు.