Dharma Sangrah

ఆంధ్రప్రదేశ్‌లో తగ్గేదేలే అంటున్న కరోనా వైరస్

Written By ఠాగూర్
Updated: బుధవారం, 26 జనవరి 2022 (19:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. కోవిడ్ టెస్టుల సంఖ్య తగ్గించినప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 49143 మందికి కోవిడ్ టెస్టులు చేయగా, 13618 మందికి ఈ వైరస్ సోకింది. 
 
అలాగే, తొమ్మిది మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖలో ఇద్దరి చొప్పున, చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అలాగే, మరో 8687 మంది కోలుకున్నారు. 
 
తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా విశాఖపట్టణంలో 1791, అనంతపురంలో 1650, గుంటూరులో 1464, కర్నూలులో 1409, ప్రకాశంలో 1295 చొప్పు పాజిటివ్ కేసులు వెలుగు చూపాయి. 

అన్నీ చూడండి

బిగ్ బాస్ తెలుగులో బిగ్ ట్విస్ట్, ఏంటది?

ఈ వారం డిజాస్టర్ గా నిలిచిన సర్దార్ 2, మందాడి, మారెమ్మ చిత్రాలు

Deepika Padukone :దువా రెండవ పుట్టినరోజున గర్బిణీ ఫొటోలను పంచుకున్న దీపికా పడుకోన్

సినిమాలను వదులుకుంటానన్న సమంత.. వద్దని మా ఇంటి బంగారం చేసిన రాజ్

ది ప్యారడైజ్ షూటింగ్ పూర్తి- శరవేగంగా పోస్ట్-ప్రొడక్షన్ పనులు - సెప్టెంబర్ 24న రిలీజ్

తర్వాతి కథనం
Show comments