Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో పెరుగుతున్న ఒమిక్రాన్... పాజిటివ్ కేసులు 21

Written By ఠాగూర్
Published: మంగళవారం, 21 డిశెంబరు 2021 (12:09 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఒమిక్రాన్ వైరస్ క్రమక్రమంగా పాగా వేస్తోంది. ఒక్కో కేసుతో మొదలైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 21కు చేరుకుంది. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. 
 
ఇటీవల దుబాయ్ నుంచి ఈ గూడెంకు వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్ అనితేలింది. దీంతో బాధితుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే, ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా కొత్త వేరియంట్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరి ఫలితాలు రావాల్సివుంది. 
 
మరోవైపు, జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు వెలుగు చూడటంతో జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల విదేశాల నుంచి పది మందికి, ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన విషయం తెల్సిందే. 

అన్నీ చూడండి

Eesha Rebba : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ నిజమే అనేలా వినాయకుడి పూజ !

Rashmika Mandanna : ఎంఎస్ సుబ్బలక్ష్మిగా రశ్మిక మందన్న- అల్లు అరవింద్ ప్రకటన

Ramyakrishna :ఒక్క చూపు... ఆ ఫ్రేమ్ అంతా ఆమెదే.. అంటూ మంచు మనోజ్ ప్రశంస

Samantha Ruth Prabhu: శ్రీచక్ర యంత్రంతో సమంత సీమంతం Photos

Dr. Rajendra Prasad: అందరి కథ. క్లైమాక్స్ సీన్లో ఆర్టిస్టులూ కన్నీరు పెట్టుకున్నారు : డా. రాజేంద్రప్రసాద్

తర్వాతి కథనం
Show comments