Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంతువుల నుంచి సోకుతున్న కరోనా వైరస్?

Written By ఠాగూర్
Updated: గురువారం, 20 అక్టోబరు 2022 (17:15 IST)
ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్ మూలాల గురించి ఇంకా పరిశోధన సాగుతూనే ఉంది. ఈ మూలాలను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు అన్ని రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ పరిశోధనల్లో భాగంగా, కరోనా వైరస్ మూలాలు జంతువుల్లోనే ఉన్నాయని.. వాటి నుంచే మానవులకు సోకి ఉండవచ్చని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ వ్యాసాన్ని అంతర్జాతీయ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. 
 
అనేక దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తిపై విస్తృతంగా పరిశోధన జరుగుతుంది. తాజాగా అమెరికా పరిశోధకులు చేపట్టిన పరిశోధనలో ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులోభాగంగా, ఒమిక్రాన్‌కు సంబంధించి నిర్మాణాత్మక జీవశాస్త్ర విశ్లేషణను జరిపారు. అందులో ఒమిక్రాన్ స్పైక్ ప్రొటీన్‌లో చోటుచేసుకున్న చాలా ఉత్పరివర్తనాలు ఎలుకల్లోని రెసిఫ్టర్‌ల నుంచి గ్రహించినట్టు గుర్తించారు. వీటి ద్వారానే ఒమిక్రాన్‌ వేరియంట్‌ మూలాలు మానవుల నుంచికాకుండా.. ఇతర జంతు జాతుల నుంచే వచ్చి ఉండవచ్చనే అంచనాకు వచ్చారు.
 
'జంతువుల నుంచి మానవులకు కరోనా వైరస్‌లు సంక్రమించడం అనేది ప్రపంచ ఆరోగ్యానికి ఎప్పుడూ ముప్పే. ఇప్పటివరకు మానవుల్లో వ్యాప్తిలో ఉన్న కరోనా వైరస్‌లన్నీ జంతువుల నుంచే వచ్చాయని తాజా నివేదిక తెలియజేస్తోంది' అని అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసొటాకి చెందిన నిపుణుడు, తాజా పరిశోధన అధ్యయనకర్త ఫాంగ్‌ లీ వెల్లడించారు. 

అన్నీ చూడండి

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

Deepti Ghanta: నితిన్, దీప్తి గంట చిత్రం అలియాస్ రుక్మిణీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

Kaka Latest: బాధ్యతల గల పాత్రగా కాకా ని మలుస్తున్న బాబీ కొల్లి - చిరంజీవిపై కీలక సన్నివేశాలు

తర్వాతి కథనం
Show comments