శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 డిశెంబరు 2020 (12:23 IST)

పీపీఈ కిట్స్‌తో పెళ్లి చేసుకున్న వధూవరులు.. పండితుడు కూడా ఆ డ్రెస్‌లో..

కోవిడ్ వైరస్ జనాలకు చుక్కలు చూపిస్తోంది. కరోనా వైరస్ కారణంగా ప్రజలు అప్రమత్త చర్యలు తీసుకుంటున్నారు. కోవిడ్‌కు దూరంగా వుంటూ తగిన జాగ్రత్తలను పాటిస్తూ ఆ జీవనశైలికి అలవాటు పడ్డారు. మాస్కులు ధరించడం, చేతులు మాటిమాటికీ శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం అనేవి మన నిత్య జీవితంలో భాగం అయ్యాయి. అయితే కరోనా నేపథ్యంలో పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలను జనాలు పరిమిత సంఖ్యలో అతిథులతో నిర్వహిస్తున్నారు. కానీ అక్కడ మాత్రం వధువుకు ఏకంగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. అయినా వారు పెళ్లి చేసుకోవడం మానలేదు.
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని షాబాద్ అనే ప్రాంతంలో వధువుకు కోవిడ్ సోకింది. దీంతో బారిలోని కోవిడ్ సెంటర్‌లో ఆమె చికిత్స పొందుతోంది. అయితే పెళ్లి ఉండడంతో వారికి ఒక దశలో ఏం చేయాలో తెలియలేదు. కానీ చివరకు వారు పీపీఈ కిట్లను ధరించి వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అదే పని చేశారు. పండితుడు కూడా పీపీఈ కిట్ ధరించి వారి వివాహం జరిపించాడు. ఈ వివాహంలో వధువు వరుడుతో పాటు వున్న ఇద్దరూ పీపీ కిట్ ధరించారు. అతిథులంతా మాస్కులతో ఆమడ దూరంలో నిలిచారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.