శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 డిశెంబరు 2020 (10:48 IST)

తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. ఒక్క రోజే 502 కేసులు..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా వెయ్యికంటే తక్కువ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం కొత్తగా 502 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,78,318కి చేరింది.
 
ఇందులో 2,69,230 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9,627 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక తెలంగాణలో కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1461కి చేరింది. నిన్న ఒక్కరోజు 894 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా సోమవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 805 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ముగ్గురు (3) మరణించారు. 
 
ఇదిలావుంటే.. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా 46,597 కరోనా పరీక్షలు చేశారు. వీటితో కలిపి నవంబరు 30వ తేదీ వరకు మొత్తం 55,00,058 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.