శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 జనవరి 2022 (18:38 IST)

తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావుకు కరోనా

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో ఆస్పత్రితో చేరినట్లు శ్రీనివాసరావు వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 
ఇకపోతే.. వైద్య సిబ్బందిని కరోనా కాటేస్తోంది. గాంధీ ఆస్ప్రత్రిలో 120 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. ఉస్మానియా పరిధిలో 159 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆదిలాబాద్‌ రిమ్స్‌లో 73 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది.
 
ఇంకా హైదరాబాద్ పోలీసులపై కూడా కరోనా పంజా విసిరింది. ప్రతి పోలీస్ స్టేషన్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఎస్ఐలతో పాటు కానిస్టేబుల్స్ కరోనా బారిన పడుతున్నారు. సీసీఎస్, సైబర్ క్రైమ్‌లో పనిచేస్తున్న 20 మంది కరోనా బారిన పడ్డారు.