ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు.. 1,502కి చేరిన మృతుల సంఖ్య

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం రాత్రి 8గంటల వరకు 52,057 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో తాజాగా 536 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,79,135కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. 
 
మంగళవారం కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,502కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 622 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,70,450కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,183 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 5,041 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 62,57,745కి చేరింది.