Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో అత్యంత కారుచౌక కరోనా వ్యాక్సిన్ ఏది?

Written By సెల్వి
Updated: శనివారం, 5 జూన్ 2021 (07:39 IST)
దేశాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ బారినపడి అనేక మంది మృత్యువాతపడుతున్నారు. వేలాది మందికి ఈ వైరస్ సోకుతోంది. ఈ క్రమంలో ఈ వైరస్ బారినపడకుండా ఉండేందుకు వీలుగా అనేక ఫార్మా కంపెనీలు వివిధ రకాలైన వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాయి. ఇవి ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో మన దేశంలోనే మరో వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. 
 
హైదరాబాదుకు చెందిన బయోలాజికల్ ఇ ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన కోర్బెవాక్స్ కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతం కేంద్రం అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. ఇది అన్ని అనుమతులు పొంది మార్కెట్లోకి వస్తే ఇప్పుడున్న అన్ని కరోనా వ్యాక్సిన్లలోకి ఇదే అత్యంత చౌకైన వ్యాక్సిన్ కానుంది. కోర్బెవాక్స్ సింగిల్ డోస్ ధరను బయోలాజికల్ ఇ సంస్థ రూ.250గా నిర్ణయించింది. అదే రెండు డోసులు అయితే రూ.400కే పొందవచ్చు. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల వెల్లడించారు.
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, ఇతర సంస్థల వ్యాక్సిన్లతో పోల్చితే ఇది తక్కువ ధర అని చెప్పాలి. సీరం ఇన్ స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే రేటు రూ.300 కాగా, ప్రైవేటు ఆసుపత్రుల వద్ద రూ.600 పలుకుతోంది. 
 
భారత్ బయోటెక్ తయారుచేసే కొవాగ్జిన్ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400కి అందిస్తుండగా, దీని ధర ప్రైవేటు ఆసుపత్రుల వద్ద రూ.1,200గా ఉంది. ఇక, రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ఒక్క డోసు వెల రూ.995. వీటన్నింటితో పోల్చితే బయోలాజికల్ ఈ సంస్థ రూపొందించిన కోర్బెవాక్స్ చౌకైన వ్యాక్సిన్‌గా చెప్పుకోవచ్చు. 

అన్నీ చూడండి

Dhanush: ఇరుముడి నటి నక్షత్రను వీడియో కాల్‌లో ధనుష్ ప్రశంస, రష్మిక కితాబు

Kiku chiranjeevi: మా ఫ్లెక్సీలను తీసేసి డబ్బింగ్ సినిమా ఫ్లెక్సీలు పెడుతున్నారు : కికు యనమల

Thammareddy Bharadwaja :పెళ్లి చేసి చూడు అంటారు. అలా కొత్త సినిమా మేకింగ్ లో ఇబ్బందులు దాటాం

మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్ తో జగమే సంగీతం' ట్రైలర్‌

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ సినిమా హైవాన్ ట్రైలర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments