Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు పొరలున్న మాస్క్‌తో 70 శాతం రక్షణ

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (11:10 IST)
దేశం కరోనా వైరస్ మహమ్మారి గుప్పెట్లో చిక్కుకుంది. ఈ వైరస్ బారినపడుకుండా ఉండేందుకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి ముఖానికి మాస్క్‌లు ధరిస్తున్నారు. 
 
అయితే, కరోనా వైరస్ సోకకుండా కేవలం సర్జికల్ మాస్క్ మాత్రమే ధరించాలన్న నియమ నిబంధన లేదనీ, మూడు పొరలు ఉన్న క్లాత్ మాస్క్ అయినా సరిపోతుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
మూడు పొరలతో కూడిన క్లాత్ మాస్కు కూడా సర్జికల్ మాస్క్ స్థాయిలోనే పనిచేస్తుందని బ్రిస్టల్, సర్రే విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది.
 
మూడు పొరలతో ఉన్న మాస్క్ ధరించిన వారు శ్వాస తీసుకునేటప్పుడు లోపలికి వెళ్లే గాలి మెలి తిరుగుతుందని, ఫలితంగా వైరస్‌తో కూడిన గాలి తుంపర్లు గాలి వెళ్లే మార్గం ద్వారా వెళ్లలేవని తేలింది. 
 
మాస్కులోని పోగులను ఢీకొట్టి అవి అక్కడే ఆగిపోతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. సరిగా ధరించే మూడు పొరల మాస్క్ వల్ల 50 నుంచి 70 శాతం వరకు రక్షణ లభిస్తుందని వివరించారు.
 
అలాగే, ఇటీవల భారత్‌లో జరిగిన ఓ అధ్యయనంలో కూడా మూడు పొరలున్న క్లాత్ మాస్కే ఉత్తమని తేలింది కూడా. దీంతో పలువురు ఈ తరహా మాస్కులను ధరిస్తున్నారు. అయితే, డబ్బున్నవారు మాత్రం ఎన్95 మాస్కులను ధరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments