Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో బాగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

Written By ఠాగూర్
Updated: సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (19:03 IST)
ఆంధ్ర్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 18,601 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేయగా, వీరిలో 1,597 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో అత్యధిక కేసులో తూర్పు గోదావరి జిల్లాలో 478 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 220, గుంటూరులో 144, చిత్తూరులో 123, కడపలో 117, విజయనగరం జిల్లాలో 100 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో కేవలం 15 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అదేసమయంలో కరోనా వైరస్ నుంచి 8766 మంది బాధితులు కోలుకున్నారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలుపుకుంటే ఏపీలో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన కోవిడ్ బాధితుల సంఖ్య 14,672కు చేరింది. రాష్ట్రంలో 62,395 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. 
 

అన్నీ చూడండి

Eesha Rebba : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ నిజమే అనేలా వినాయకుడి పూజ !

Rashmika Mandanna : ఎంఎస్ సుబ్బలక్ష్మిగా రశ్మిక మందన్న- అల్లు అరవింద్ ప్రకటన

Ramyakrishna :ఒక్క చూపు... ఆ ఫ్రేమ్ అంతా ఆమెదే.. అంటూ మంచు మనోజ్ ప్రశంస

Samantha Ruth Prabhu: శ్రీచక్ర యంత్రంతో సమంత సీమంతం Photos

Dr. Rajendra Prasad: అందరి కథ. క్లైమాక్స్ సీన్లో ఆర్టిస్టులూ కన్నీరు పెట్టుకున్నారు : డా. రాజేంద్రప్రసాద్

తర్వాతి కథనం
Show comments