Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 12 వేలు దాటిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Written By వరుణ్
Updated: గురువారం, 20 ఏప్రియల్ 2023 (10:55 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 12 వేలు దాటిపోయింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన ప్రకటన మేరకు.. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు దేశ వ్యాప్తంగా మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 12591కు చేరింది. బుధవారంతో పోల్చుకుంటే ఈ కేసుల సంఖ్య 20 శాతం మేరకు పెరిగింది. 
 
కొత్తగా నమోదైన కేసుల్లో ఒమిక్రాన్ ఉపరకమైన ఎక్స్ బీబీ 1.16 బాధితులే ఎక్కువా ఉన్నట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే, పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన పనిలేదని, అర్హులైన వారంతా వీలైనంత త్వరగా బూస్టర్ డోసులు వేయించుకోవాలని సూచించింది.
 
మరోవైపు, దేశవ్యాప్తంగా సాగుతున్న వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు మొదటి, రెండో డోసులు కలిపి 220.66 కోట్ల టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.67శాతంగా ఉందన్న కేంద్రం.. గడిచిన 24 గంటల్లో 10,827 మంది వైరస్‌ నుంచి కోలుకున్నట్లు చెప్పింది. ఇప్పటివరకు 92.48 కోట్ల కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. గడిచిన 24 గంటల్లో 2,30,419 పరీక్షలు చేసినట్లు వెల్లడించింది. 

అన్నీ చూడండి

Rakul Preet Singh: అందం, అహంకారం ఉన్న స్త్రీగా నటించడం గర్వంగా వుంది

Allari Naresh: రంభ ఊర్వశి మేనక స్టెప్ లేస్తే తెల్లారి వేడుక... సాంగ్ రిలీజ్

Nani: ఫోక్ మాస్ ఆంథమ్‌గా ది ప్యారడైజ్ సెకండ్ సింగిల్ డల్లాస్‌లో లాంచ్

Vishwak Sen : పొలిటికల్ యాక్షన్ డ్రామాగా విశ్వక్ సేన్ LEGACY రాబోతోంది

స్కూల్ కు వెళ్లేప్పుడు చేసే సందడంతా సమ్మర్ హాలిడేస్ పాట

తర్వాతి కథనం
Show comments