Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ సోకి 501 మంది మృత్యువాత

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 12 నవంబరు 2021 (12:31 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదులో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒకరోజు పదివేలకు చేరుకుంటే మరోరోజు 15 వేల వరకు నమోదవుతున్నాయి. అలాగే, ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. 
 
తాజాగా గడిచిన 24 గంటల్లో 12,516 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. బుధవారం 501 మంది ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపింది. యాక్టివ్ కేసులు 267 రోజుల క‌నిష్ఠానికి చేరాయి. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,37,416 మంది చికిత్స తీసుకుంటున్నారు.
 
నిన్న క‌రోనా నుంచి 13,155 మంది కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,38,14,080కు చేరింది. మృతుల సంఖ్య మొత్తం 4,62,690కి పెరిగింది. నిన్న‌ 53,81,889 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,10,79,51,225 డోసుల వ్యాక్సిన్లు వాడారు. నిన్న‌ 11,65,286 క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు. 

అన్నీ చూడండి

Adivi Sesh: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ 2027న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Nani: న్యాచురల్ స్టార్, కయాదు లోహార్ బ్రాండ్ న్యూ పోస్టర్

Allu and Rashmika: రాకా కోసం క్రేజీ కాంబినేషన్ పుష్ప జోడీ మళ్లీ రంగంలోకి దిగింది !

Manchu Mano: ఆస్మాన్ తో మేఘాంశ్ గొప్ప హిట్ కొట్టాలని కోరుకుంటున్నా : మంచు మనోజ్

SS Rajamouli: వారణాసిలో రామాయణ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ ?

తర్వాతి కథనం
Show comments