శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 29 జులై 2020 (22:59 IST)

మాస్కు వేసుకున్నాం కదా, కరోనావైరస్ మనల్నేం చేయదని అనుకోకూడదు, ఎందుకంటే?

ఫేస్ మాస్క్‌లు ధరించే వారిలో చాలామంది అవి ధరించాము కనుక ఇక కరోనావైరస్ ఏమీ చేయలేదనే భావనలో వుంటున్నారట. దీనితో వారు చేతులు కడుక్కోవడం, హ్యాండ్ శానిటైజర్‌లను ఉపయోగించడం వంటి ఇతర భద్రతా చర్యలను విస్మరిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా మహమ్మారిపై తేలిన విషయం ఇది.
 
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం మరియు కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకుల బృందం ‘రిస్క్ పరిహారం’ కింద ఓ పరిశోధన చేసింది. ఇందులో భాగంగా కరోనావైరస్ ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఎలా కలిగిస్తుందో అర్థం చేసుకోవడానికి యత్నించింది. మహమ్మారి యొక్క ప్రారంభ దశలలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచనల మేరకు ఫేస్ మాస్క్‌లను విస్తృతంగా ఉపయోగించడం వల్ల చాలామంది వాటిని ఉపయోగించడం మొదలుపెట్టారు. ఐతే ఈ మాస్కు ధరించినవారు ఇతర ముఖ్యమైన చర్యలను విస్మరిస్తున్నట్లు తేలింది.
 
మాస్కులు వేసుకున్నవారు ఇతర జాగ్రత్తలు... చేతులు శుభ్రపరచుకోవడం, శానిటైజర్లు వినియోగించడం, భౌతికదూరం పాటించడం వంటివి చేయకపోతే కరోనావైరస్ సోకే అవకాశాన్ని కొట్టిపారేయలేం.