శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 26 డిశెంబరు 2020 (18:00 IST)

బ్రిటన్ నుంచి వచ్చిన ఆ 184 మంది ఎక్కడ? తెలంగాణ అధికారులు పరుగులు

ఇప్పుడు బ్రిటన్ నుంచి వచ్చినవారు అంటేనే జంకుతున్నారు. దీనికి కారణం అక్కడ కరోనా కొత్తవైరస్ విజృంభిస్తుండటమే. ఇప్పటికే రాష్ట్రంలో ఈ కొత్త వైరస్ బారిన పడినవారి సంఖ్య 18కి చేరింది. మరోవైపు యూకె నుంచి తెలంగాణకు వచ్చి ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారి సంఖ్య 92. వీరు ఎక్కడెక్కడకు వెళ్లారన్న సంగతి తెలుసుకుని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం అందించింది తెలంగాణ ప్రభుత్వం.
 
ఇదిలావుంటే బ్రిటన్ నుంచి వచ్చి తెలంగాణ లోని ఆయా ప్రాంతాలకు వెళ్లిన వారి సంఖ్య 180గా వున్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా ఎక్కడెక్కడ వున్నారన్న విషయాన్ని తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
 
మరోవైపు బ్రిటన్ నుంచి హైదరాబాద్ వచ్చిన వారితో సన్నిహితంగా వున్నవారి నుంచి నమూనాలను సేకరించి సీసీఎంబీకి పంపించారు. మొత్తమ్మీద ఇప్పటివరకూ అందుబాటులోకి రాని ఆ 180 మంది మరెంతమందితో కాంటాక్టులో వుంటారన్న ఆందోళన వ్యక్తమవుతోంది.