Daily Horoscope
✕

ఏ వయసు పిల్లలు మాస్క్ ధరించాలి : డబ్ల్యూ‌హెచ్ఓ క్లారిటీ

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 23 ఆగస్టు 2020 (12:42 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ బారినపడి అనేక మంది మృత్యువాతపడ్డారు. ఈ వైరస్ బారినపడుకుండా ఉండాలంటే ఖచ్చితంగా ముఖానికి మాస్క్ ధరించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ నియంత్రణకు ఇప్పటివరకు ఎలాంటి మందు లేకపోవడంతో ముఖానికి మాస్క్ ధరించడం ఒక్కటే మందు అని వైద్యులు అంటున్నారు. తద్వారా ఈ వైరస్ నుంచి దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. 
 
అయితే, ఈ విషయంలో పిల్లలు, పెద్దలు అందరూ మాస్కులు ధరిస్తుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. మాస్కుల విషయంలో తాజాగా సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. 12 ఏళ్లు పైబడిన పిల్లలకు పెద్దలకు మాదిరిగానే కరోనా వచ్చే అవకాశాలు ఉండడంతో వారు పెద్దలు ధరించినట్టుగానే మాస్కులు ధరించాలని పేర్కొంది. 
 
ఐదేళ్లలోపు పిల్లలు మాత్రం మాస్క్ ధరించడం తప్పనిసరికాదని, వీరికి కరోనా సోకే ప్రమాదం తక్కువని పేర్కొంది. 6 నుంచి 11 ఏళ్ల లోపు ఉన్న చిన్నారులు మాత్రం రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం తప్పనిసరిగా మాస్క్ ధరించాలని వివరించింది. పిల్లలు ఆడుకునే సమయంలో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే, ఆ సమయంలో భౌతిక దూరం పాటించడం తప్పనిసరని తెలిపింది. 

అన్నీ చూడండి

Soori 7: సూరి ఏడవ కథానాయకుడిగా సూరి 7 చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది

Naga Chaitanya :మైథికల్ థ్రిల్లర్ నాగ చైతన్య వృషకర్మ సరికొత్త అడ్వెంచర్ పోస్టర్

Anupama: నా పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి లేదు. ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోమనే అన్నారు : అనుపమ పరమేశ్వరన్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ హీరోగా అనిల్ సుంకర చిత్రం ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్

Teja Sajja: గరివిడి లక్ష్మి మ్యూజికల్ కాన్సర్ట్ తో గౌరవం తీసుకొచ్చే సినిమా : తేజ సజ్జా

తర్వాతి కథనం
Show comments