శనివారం, 29 నవంబరు 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 నవంబరు 2025 (17:39 IST)

బిగ్ బాస్ ఫేమ్‌ను పెళ్లి చేసుకున్న క్రికెటర్ అనిరుద్ధ శ్రీకాంత్

samyukta - aniruddha
తమిళ బిగ్ బాస్ ఫేమ్, నటి  సంయుక్తా షణ్ముగనాథన్‌ను క్రికెటర్ అనిరుద్ధ శ్రీకాంత్ వివాహం చేసుకున్నారు. మాజీ క్రికెటర్ శ్రీకాంత్ తనయుడే అనిరుద్ధ శ్రీకాంత్. సంయుక్త, అనిరుద్ధల వివాహం గురువారం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట తమ ఫోటోలు, వీడియోలను షోషల్ మీడియాలో షేర్ చేసింది. 
 
ఈ వివాహంపై సంయుక్త స్నేహితురాలు, టీవీ యాంకర్ భావన బాలకృష్ణన్ స్పందిస్తూ, కొన్నిసార్లు ఒకేలాంటి వాళ్లు కలుస్తారు. కొన్నిసార్లు భిన్న మనస్తత్వాలు ఆకర్షితులవుతారు. కానీ, స్నేహితులుగా ఒకరికొకరు తోడుగా నిలిచి, ఒకరినొకరు ఓదార్చుకున్న జంట అనిరుద్ధ, సంయుక్త. మీ ఇద్దరికీ అందమైన జీవితం అందించాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. 
 
కాగా, బిగ్ బాస్ షోతో బాగా ఫేమస్ అయిన సంయుక్తా... ఇటీవల వచ్చిన మద్రాస్ మాఫియా అనే చిత్రంలో పోలీస్ అధికారిణిగా కనిపించారు. మరోవైపు, అనిరుద్ధ శ్రీకాంత్ క్రికెటర్‌గా, క్రీడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే, అనిరుద్దతో తాను డేటింగ్‌లో ఉన్నట్టు ఈ యేడాది ఆగస్టు నెలలో సంయుక్త ప్రకటించిన విషయం తెల్సిందే. ఇపుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు పలువురు సెలెబ్రిటీలు, సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.