ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టు.. సెప్టెంబర్ 28 నుంచి పోరు
చైనాలోని హాంగ్‍జౌ వేదికగా సెప్టెంబర్ 23వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ మధ్య ఆసియా గేమ్స్ జరగనున్నాయి. ఆసియా గేమ్స్ స్పోర్ట్స్ ఈవెంట్‍కు భారత టీమ్‍లను పంపాలని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) నిర్ణయించుకుంది. అయితే, మహిళల జట్టు మాత్రం పూర్తి సామర్థ్యంతోనే వెళ్లనుంది.
అయితే, ఇదే సమయంలో పురుషుల వన్డే ప్రపంచకప్ జరగనుండటంతో ఆసియా గేమ్స్‌కు ద్వితీయ శ్రేణి జట్టు పంపాలని బీసీసీఐ ఆలోచిస్తోంది.
అంటే ప్రపంచకప్‍లో టీమిండియాలో చోటు లభించని ఆటగాళ్లతో, ఐపీఎల్ ప్లేయర్లతో ఆసియా క్రీడలకు భారత పురుషుల జట్టును పంపాలని బీసీసీఐ ఆలోచిస్తోంది.
ఈ ఏడాది ఆసియా క్రీడల్లో సెప్టెంబర్ 19న భారత మహిళల జట్టు మ్యాచ్‍లు ఆరంభం కానున్నాయి. భారత పురుషుల టీమ్ సెప్టెంబర్ 28న పోరాటాన్ని ప్రారంభిస్తుంది.