బుధవారం, 27 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (13:24 IST)

జాతీయ పతాకాన్ని పట్టుకునేందుకు నో చెప్పిన జై షా.. ఎందుకో తెలుసా?

jayshah
ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి భారత్, పాకిస్థాన్ దేశాల కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. ప్రత్యర్థి జట్టును 147 పరుగులకే ఆలౌట్ చేసిన భారత బౌలర్లు... ఆ తర్వాత 148 పరుగుల విజయలక్ష్యాన్ని మరికొన్ని బంతులు మిగిలివుండగానే గెలిచింది. అయితే, మ్యాచ్ విజయం తర్వాత బీసీసీఐ సెక్రటరీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తనయుడు జై షాకు బీసీసీఐ అధికారులు జాతీయ జెండాను చేతికి ఇవ్వబోయారు. 
 
అయితే, ఆయన తీసుకునేందుకు నిరాకరించారు. ఇది చర్చనీయాంశంగా మారింది. త్రివర్ణ పతకాన్ని వద్ద జైషాను లక్ష్యంగా చేసుకుని పలువురు విమర్శలు చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా #JayShah పేరుతో ఓ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. బీజేపీయేతర నేత జాతీయ పతాకాన్ని తిరస్కరిస్తే బీజేపీ నేతలంతా ఎదురుదాడికి దిగేవారనీ, దేశ వ్యతిరేక ముద్ర వేసేవారని విమర్శలు వెల్లువెత్తున్నాయి.
 
అయితే, జైషాను విమర్శించడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. అవగాహన లేకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు. జైషా కేవలం బీసీసీఐ సెక్రటరీ మాత్రమే కాదనే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అని, అందుకే కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఆసియా కప్‌లో భాగమైన అన్ని దేశా విషయంలో ఆయన తటస్థ వైఖరిని ప్రదర్శించాల్సి ఉంటుందని తెలిపారు.