గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఆగస్టు 2022 (21:57 IST)

పెళ్లి ఆలోచన లేదు.. పీవీ సింధు కామెంట్స్ (video)

pv sindhu
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా అదరగొట్టిన పీవీ సింధు ఆటలోనే కాకుండా.. సోషల్ మీడియా వేదికగా పీవీ సింధు నిత్యం పలు డాన్స్ వీడియోలు చేస్తూ తనలో ఈ యాంగిల్ కూడా ఉందంటూ  చెప్తూ పెద్ద ఎత్తున అభిమానులను సంపాదంచుకుంది. 
 
ఇకపోతే తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న పీవీ సింధు తన వృత్తిపరమైన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు సొంతంగా ఒక అకాడమీ స్థాపించాలనే కోరిక ఉందని తెలిపారు.
 
ఇకపోతే ఇండస్ట్రీకి సంబంధించిన ప్రశ్నలను వేయగా అందుకు ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. మీ ఫేవరెట్ హీరో ఎవరు అని ప్రశ్నించగా తనకు ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారని వారిలో ప్రభాస్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు.
 
ఇకపోతే పెళ్లెప్పుడు అంటూ ఆలీ తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రస్తావించారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తనకి ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదని 2024 ఒలింపిక్స్‌లో ఎలాగైనా గోల్డ్ మెడల్స్ సాధించాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.