శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2022 (11:12 IST)

దేశంలో 90 వేలకు తగ్గిన కరోనా క్రియాశీలక కేసులు

covid test
దేశంలో కొత్తగా మరో 10256 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో క్రియాశీలక కేసులు సంఖ్య 90 వేలకు తగ్గింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 4,22,322 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, మొత్తం 10256 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. అలాగే, మరో 13 మంది వరకు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
గడిచిన 24 గంటల్లో 4,22,322 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 10,256 కేసులు వెలుగులోకి వచ్చాయి. నిన్న 68 మంది మృతి చెందారు. వీటిలో 29 మరణాలు ఒక్క కేరళ రాష్ట్రం నుంచే ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకూ చోటుచేసుకున్న మొత్తం మరణాల సంఖ్య 5,27,556కు చేరింది.
 
గడిచిన 24 గంటల్లో 13,528 మంది కోలుకోగా.. ఇప్పటివరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.37 కోట్లు (98.61%) దాటింది. ఇక క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా క్షీణిస్తూ 90,707(0.20%)కు చేరింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ద్వారా నిన్న 31,60,292 టీకాలు పంపిణీ చేయగా.. ఇప్పటివరకూ అందించిన మొత్తం డోసుల సంఖ్య 211 కోట్లు దాటింది.