Marine Drive: మహిళ స్పృహతప్పి పడిపోతే.. పోలీస్ భుజాన్నేసుకుని? (video)
ప్రపంచ కప్ వేడుకల సందర్భంగా స్పృహతప్పి పడిపోయిన మహిళకు సహాయం చేసేందుకు ప్రయత్నించిన పోలీసుకు చుక్కలు కనిపించాయి. ముంబై వీధుల్లో టీ-20 ప్రపంచ కప్ విజయయాత్ర జరిగిన సంగతి తెలిసిందే.
అయితే ఈ బస్ పరేడ్ సందర్భంగా వేలాది మంది జనం రోడ్లపైకి రావడం ప్రపంచ కప్ గెలిచిన సందర్భంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. కానీ ఈ భారీ జనసంద్రంతో ఇబ్బందులు తప్పలేదు. పోలీసులకు ఈ జనాన్ని అదుపు చేయడం చాలా కష్టతరంగా మారింది.
ట్వంటీ 20 ప్రపంచ కప్‌లో భారతదేశం సాధించిన విజయాన్ని పురస్కరించుకుని, జూలై 4న ముంబైలోని మెరైన్ డ్రైవ్‌కు వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ట్వంటీ 20 ప్రపంచ కప్‌లో భారతదేశం సాధించిన విజయాన్ని పురస్కరించుకుని, జూలై 4న ముంబైలోని మెరైన్ డ్రైవ్‌కు వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఈ మెరైన్ డ్రైవ్ సందర్భంగా ఓ పోలీస్ పడిన అవస్థకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక పోలీసు వ్యక్తి స్పృహ తప్పి పడిన మహిళను భుజాన్ని వేసుకుని గుంపు నుంచి బయటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు.
అయితే ఆ గుంపు అతనిని వెనక్కి నెట్టడంతో సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఆ మహిళను ఆ గుంపు నుంచి బయటికి ప్రయత్నం సఫలమైనట్లు తెలియట్లేదు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఇలాంటి గుంపుతో వున్న ప్రదేశానికి ఎందుకు రావడమని ఆ మహిళను కొందరు తిడుతుంటే.. ఇలాంటి జనసందోహంతో కూడిన విజయోత్సవం అవసరమా అని మరికొందరు అంటున్నారు.
జనాల మధ్య ఇరుక్కుపోతే.. పరిస్థితి ఏంటని అర్థం చేసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అంత జనాన్ని లెక్కచేయకుండా మహిళను కాపాడేందుకు ఆ పోలీస్ చేసిన సాహసాన్ని చాలామంది మెచ్చుకుంటున్నారు.