గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (09:54 IST)

ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌కు దూరమైన దీపక్ చాహర్

deepak chaahar
స్వదేశంలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ పోటీలకు దూరమై భారత బౌలర్ దీపక్ చాహర్ ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 ప్రపంచ కప్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెన్నుకు తగిలిన గాయానికి మరో నాలుగు నెలల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో ఆయన టీ20 ప్రపంచ కప్‌కు దూరంకానున్నారు. ఈ టోర్నీ అక్టోబరు - నవంబరు నెలల్లో జరుగనుంది. 
 
ప్రస్తుతం బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడెమీలో పునరావాసంలో ఉంటూ కోలుకుంటున్న చాహర్.. ఇటీవల నెట్ ప్రాక్టీస్‌ను కూడా మొదలుపెట్టారు. దీంతో ఐపీఎల్ సగం మ్యాచ్‌లకైనా అందుబాటులోని ఉంచాలని ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ భావించింది. 
 
కానీ, తాజా గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమైంది. కాగా, చాహర్‌ను సీఎస్కే జట్టు రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, అతను అందుబాటులో లేకపోవడం ఆ జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫలితంగా వరుస మ్యాచ్‌లలో సీఎస్కే జట్టు ఓటములను చవిచూస్తుంది. దీంతో చాహర్ స్థానంలో ముగ్గురు బౌలర్ల పేర్లను పరిశీలిస్తున్నారు.