బుధవారం, 1 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (13:16 IST)

మే నెలలో ఎస్టిల్లో "మిస్టర్ అండ్ మిస్ సదరన్ క్రౌన్ 2022" పోటీలు

southern crown
ఎస్టిల్లో మిస్టర్ అండ్ మిస్ సదరన్ క్రౌన్ 2022 ఆడిషన్‌‌‌కు విశేష స్పందన లభిస్తుంది. ఈ పోటీలను రుబారు గ్రూప్స్‌తో జాయింట్ వెంచర్‌ని నిర్వహిస్తున్నారు. 
 
మిస్టర్ అండ్ మిస్ సదరన్ క్రౌన్ పోటీలు 2022లో మిస్టర్ పంకజ్ ఖర్బండా (రుబారు మిస్టర్ ఇండియా ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్), శ్రీమనేమరన్ (వి.ఆర్.కార్పొరేట్ కన్సల్టెన్సీ ప్రొపెరిటర్), కరుణ్ రామన్ (ఈ ఈవెంట్ యొక్క అధికారిక డైరెక్టర్)లు భాగస్వామ్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రాండ్ ఈవెంట్ ఎస్టిల్లో మిస్టర్ అండ్ మిస్ సదరన్ క్రౌన్ 2022 కోసం వీరంతా చేతులు కలిపారు. 
 
రుబారు మిస్టర్ ఇండియా ఆర్గనైజేషన్‌కు చెందిన పంకజ్ ఖర్బండా, విఆర్ కార్పొరేట్ కన్సల్టెన్సీకి చెందిన శ్రీమనేమరన్ జాయింట్ వెంచర్‌పై సంతకం చేశారు. ఆ తర్వాత ఈ గ్రాండ్ ఈవెంట్ ఎస్టిల్లో మిస్టర్ అండ్ మిస్ సదరన్ క్రౌన్ 2022ని ప్రారంభించారు. ఇప్పటికి మొదటి రౌండ్ అడిషన్ పూర్తి చేశారు. త్వరలోనే మరో రౌండ్ ఆడిషన్‌ను నిర్వహిచనున్నారు. మే నెలలో ఫైనల్ పోటీలు జరుగుతున్నాయి. 
 
ఫైనల్‌లో రుబారు ఎలైట్‌లో దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక పురుషుడు మరియు స్త్రీ పోటీపడతారు మరియు టాప్ ఫైనలిస్టులు ఎంపిక చేయబడతారు. వారు మిస్టర్ అండ్ మిస్ సదరన్ క్రౌన్ 2022గా ప్రకటించబడతారు.