శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 30 అక్టోబరు 2018 (10:37 IST)

ధోనీ కొత్త రికార్డు.. 0.08 సెకన్లలోనే స్టంప్‌ను పడగొట్టాడు...

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అపార అనుభవంతో భారత్‌కు ఎన్నో విజయాలను అందించిపెట్టాడు. వన్డే, ట్వంటీ-20లు ప్రపంచకప్‌ దేశానికి అందించిన కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా జట్టుకు విలువైన సలహాలు అందిస్తూ ముందుకు సాగుతున్నాడు. 
 
వయస్సు మీద పడుతున్నా తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో విండీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో ధోనీ సూపర్ వికెట్ పడగొట్టాడు. తద్వారా వన్డే క్రికెట్ చరిత్రలో 115 స్టంపింగులు చేసిన తొలి కీపర్‌గా ధోనీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రవీంద్ర జడేజా వేసిన బంతిని విండీస్ బ్యాట్స్‌మన్ కీమో పాల్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు.
 
అయితే, బంతి బ్యాట్‌కు చిక్కకుండా కీపర్ ధోనీ చేతుల్లో పడింది. ఆ వెంటనే మెరుపు వేగంతో స్పందించిన ధోనీ 0.08 సెకన్లలోనే స్టంప్‌ను పడగొట్టాడు. ధోనీ వేగానికి మైదానంలో ప్రేక్షకులు విస్తుపోయారు. ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్సంతా ధోనీపై ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం ఈ రికార్డుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.