గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 15 జనవరి 2023 (11:57 IST)

లలిత్ మోదీకి కరోనా.. ఐసీయూలో చికిత్స.. శ్వాస తీసుకుంటూ..?

Modi
Modi
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోదీ ఆస్పత్రి పాలయ్యారు. ఐపీఎల్ ఆటను పరిచయం చేసి మనీలాండరింగ్‌కు పాల్పడినందుకు భారత నిఘా సంస్థలకు అతను వాంటెడ్ క్రిమినల్‌గా మారాడు. లలిత్ మోదీకి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆస్పత్రిలో చేరారు.  
 
న్యుమోనియాతో మెక్సికోలో చికిత్స పొందిన ఆయన రెండు వారాల క్రితం యూకేకు తిరిగి వచ్చారు. ప్రస్తుతం అనారోగ్యం కారణంగా లండన్లోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన 24 గంటలూ ఐసీయూలో ఆక్సిజన్ సహాయంతో శ్వాస తీసుకుంటూ చికిత్స పొందుతున్నారని తన ఇన్ స్టా పేజీలో రాసుకొచ్చారు.