1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 జనవరి 2023 (15:13 IST)

కోహ్లీని సచిన్ తో పోల్చడమా.. గౌతమ్ గంభీర్ ఫైర్

gambhir
శ్రీలంకతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భాగంగా విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగిపోయాడు. ఏకంగా 87 బంతుల్లో 12 ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో 113 పరుగులు సాధించాడు. తద్వారా తన కెరీర్ లో వన్డే ఫార్మాట్ లో 45వ సెంచరీని నమోదు చేశాడు. అంతేగాకుండా ఇక స్వదేసంలో విరాట్ కోహ్లీకి ఇది 20వ సెంచరీ కావడం గమనార్హం. 
 
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తో పోలుస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లెజండ్ సచిన్ తో విరాట్ కోహ్లీని పోల్చడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. 
 
30 యార్డ్స్ సర్కిల్ వెలుపల 5 కంటే ఎక్కువ మంది ఆటగాళ్లు ఉండేవారని.. కాబట్టి బౌండరీలు కొట్టడం చాలా ఇష్టం. అందుకే సచిన్ గ్రేట్. విరాట్ కోహ్లీని సచిన్ తో పోల్చడం సరికాదంటూ వ్యాఖ్యానించాడు. గంభీర్ వ్యాఖ్యలపై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.