బుధవారం, 27 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 25 నవంబరు 2017 (10:43 IST)

క్రికెట్ దేవుడు అలా అన్నాడు.. కోచ్ కావాలనుకున్నా కానీ: సౌరవ్ గంగూలీ

జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదని టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ చెప్పాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక భారత జట్టుకు కోచ్ కావాలనుకున్నానని.. అయితే బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్

జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదని టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ చెప్పాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక భారత జట్టుకు కోచ్ కావాలనుకున్నానని.. అయితే బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడిని అయ్యానని గంగూలీ తెలిపాడు. 1999లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సందర్భంలో తాను భారత జట్టులో ఆటగాడిని మాత్రమేనని.. అప్పట్లో సచిన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే వాడని చెప్పుకొచ్చాడు. 
 
కానీ మూడు నెలలకే తాను టీమిండియా సారథిగా పగ్గాలు చేపట్టానని గంగూలీ చెప్పుకొచ్చాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియా కోచ్ అవ్వాలనుకుంటే క్యాబ్ సారథిగా అవకాశం లభించిందని గంగూలీ తెలిపాడు. దాల్మియా తనను పిలిచి ఆరు నెలలు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌లో ఉండమన్నారని.. కానీ మృతి చెందాక క్యాబ్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు ఎవరూ రాకపోతే తాను చేపట్టాల్సి వచ్చిందన్నాడు. 
 
2008లో రిటైర్మెంట్ ప్రకటించానని.. క్రికెట్ దేవుడు సచిన్ లంచ్‌కు తనతో వచ్చారని.. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావని అడిగాడని.. అయితే రిటైర్మెంట్ తీసుకునేందుకు ఇదే మంచి సమయంగా తాను భావించానని.. అందుకే క్రికెట్ నుంచి తప్పుకున్నానని సచిన్‌తో చెప్పినట్లు దాదా చెప్పుకొచ్చాడు.