మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2017 (17:29 IST)

విరాట్ కోహ్లీ నెం.1: సచిన్ కంటే అత్యధిక ర్యాంకింగ్స్ పాయింట్స్‌తో..

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గతవారం తొలి స్థానాన్ని కోల్పోయిన భారత కెప్టెన్.. సచిన్ కంటే ఎక్కువ ర్యాంకింగ్ పాయింట్స్ సాధించడం ద్వారా నెం

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గతవారం తొలి స్థానాన్ని కోల్పోయిన భారత కెప్టెన్.. సచిన్ కంటే ఎక్కువ ర్యాంకింగ్ పాయింట్స్ సాధించడం ద్వారా నెంబర్ వన్ ర్యాంకును తిరిగి సాధించగలిగాడు. న్యూజిలాండ్‌తో జ‌రిగిన సిరీస్‌లో భార‌త జ‌ట్టు 2-1 తేడాతో విజ‌యం సాధించ‌డంతో విరాట్ మ‌ళ్లీ టాప్-1లోకి చేరుకుంది. 
 
ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ 263 పరుగులు సాధించడం ద్వారా 889 ర్యాంకింగ్ పాయింట్లకు చేరుకోగలిగాడు. ఇప్పటివరకు 889 ర్యాంకింగ్ పాయింట్స్ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. 1998లో స‌చిన్ 887 ర్యాంకింగ్ పాయింట్లు సాధించాడు. ఇక మిగ‌తా బ్యాట్స్‌మ‌న్ల‌ సంగతికి వస్తే ధోనీ 11వ ర్యాంకును కైవసం చేసుకోగా, రోహిత్ శర్మ ఏడో ర్యాంకును సొంతం చేసుకున్నాడు.