బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (12:10 IST)

భారత క్రికెట్ బోర్డుపై దావా వేస్తే.. పీసీబీకి చుక్కలు కనిపించాయ్..?

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆశ్రయించింది. భారత క్రికెట్ జట్టులో అంతర్జాతీయ మ్యాచ్‌లు తగ్గిపోయిన నేపథ్యంలో తమ క్రికెట్ బోర్డుకు జరిగిన నష్టానికి గాను 447 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ పీసీబీ భారత క్రికెట్ బోర్డుపై దావా వేసింది. ముంబై పేలుళ్ల అనంతరం 2015 నుంచి భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటనరు దూరంగా వుంది. దీంతో పీసీబీకి నష్టం ఏర్పడింది. 
 
అందుకే రూ.447 కోట్లను నష్టపరిహారంగా బీసీసీఐ చెల్లించాలని దావా వేసింది. ఈ కేసును సమగ్రంగా విచారించిన ఐసీసీ.. చివరకు భారత క్రికెట్ బోర్డుకు అనుకూలంగా తీర్పు నిచ్చింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని గుర్తు చేసింది. అంతేగాకుండా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి తమ కోర్టు ఖర్చులను రాబట్టాలని బీసీసీఐ నిర్ణయించింది.