గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2022 (13:14 IST)

ఊరమాస్ స్టెప్పులతో దుమ్మురేపిన భారత ఆటగాళ్లు

kaala chasma dance
జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు మొత్తం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను క్వీన్ స్వీప్ చేసింది. సోమవారం జరిగిన చివరి వన్డేలోనూ భారత జట్టు చెమటోడ్చి 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. 
 
ఈ విజయాన్ని టీమిండియా ఆటగాళ్లు ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా, యువ ఆటగాడు ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. దీనికి సంబంధించిన వీడియోను సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. 
 
ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ పగలబడి నవ్వకుండా ఉండలేరు. ఈ వీడియోలో ప్రముఖ పంజాబీ పాట "కాలా చష్మా"కు భారతజట్టులోని స్టార్లంతా డ్యాన్స్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు.