ఆదివారం, 10 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2022 (10:00 IST)

రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్రికెటర్ రిషబ్ పంత్

rishabh pant
భారత క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొంది. దీంతో కారులో నుంచి మంటలు చెలరేగి కారు మొత్తం కాలిపోయింది. ఈ ప్రమాదం నుంచి ఆయన ప్రాణాలతో బయపటపడ్డారు. కానీ, తలకు గాయం కావడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి వెళుతుండగా రూర్కీ అనే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. 
 
కారు ప్రమాదం జరిగిన సమయంలో కారులో పంత్ ఒక్కడే ఉన్నాడు. ఆయన డ్రైవింగ్ చేస్తూ ఢిల్లీకి వెళుతున్నాడు. డివైడర్‌ను డీకొట్టగానే ఒక్కసారిగా కారులో నుంచి మటలు చెలరేగాయి. దీంతో కారు డోరు అద్దాలు పగులగొట్టి కారులో నుంచి బయటకు దూకేశాడు. ప్రమాదం కారణంగా కారు పూర్తిగా దగ్ధమైపోయింది. 
 
ఈ ఘటనపై పంత్ తలకు, మోకాలికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం స్థలానికి చేరుకుని పంత్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అయినప్పటికీ మెరుగైన వైద్య సేవల కోసం డెహ్రూడూన్‌కు తరలించారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.