మంగళవారం, 7 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 ఫిబ్రవరి 2020 (14:54 IST)

ఫైనల్ టీ20 : రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్ .. కివీస్ టార్గెట్ 164

కివీస్‌లో భారత క్రికెట్ జట్టు పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ ఆడుతోంది. మొత్తం 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 4-0 తేడోతో భారత్ ముందంజలో ఉంది. ఆదివారం చివరి మ్యాచ్ జరుగుతోంది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఫలితంగా ఆతిథ్య జట్టు ముంగిట 164 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. 
 
తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ(60 - రిటైర్డ్ హర్ట్), రాహుల్(45), శ్రేయాస్(33 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. దూబే, సంజు శాంసన్‌లు మరోమారు నిరాశపరిచారు. కివీస్ బౌలర్లలో కుగ్గెలిన్ రెండు వికెట్లు, బెన్నెట్ ఒక వికెట్ తీసుకున్నారు.
 
కాగా, విరాట్ కోహ్లీ గైర్హాజరీలో రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. బ్యాటింగ్‌లో రాణించిన రోహిత్ శర్మ 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో అలరించాడు. అయితే కండరాల గాయం బాధించడంతో 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. 
 
మిడిలార్డరులో శ్రేయాస్ అయ్యర్ 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మ్యాచ్ చివర్లో మనీష్ పాండే 4 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్ తో 11 పరుగులు రాబట్టడంతో ప్రత్యర్థి ముంగిట గౌరవప్రదమైన స్కోరును ఉంచింది.